Pages

Sunday 16 December 2012

Basic browsing tips


  • గూగుల్ క్రోమ్ లో ఇత‌ర దేశ భాష‌ల వెబ్‌పేజీల‌ను ఇంగ్లీష్‌లోకి ట్రాన్సిలేష‌న్ చేసుకోవ‌చ్చు.
  • బ్రౌజింగ్ చేసేటపుడు వెబ్‌పేజి జూమ్ పెంచుకోవ‌డం వ‌ల‌న కంటెంట్‌ను పెద్దదిగా చూడ‌వ‌చ్చు
  • బ్రౌజ‌ర్‌ను క్విక్‌లాంచ్ బార్‌లో ప్లేస్ చేయ‌డం వ‌ల‌న త్వర‌గా ఓపెన్ చేసుకోవ‌చ్చు.
  • వెబ్‌పేజీలోని హైప‌ర్‌లింక్స్‌ను న్యూట్యాబ్‌లో ఓపెన్ చేయ‌డం వ‌ల‌న తిరిగి వెన‌క పేజీలోకి వెళ్ళడానికి
    డేటా యుసేజ్ అవ‌స‌రం ఉండ‌దు. దీని వ‌ల‌న లిమిటెడ్ ఇంట‌ర్నెట్ యుజ‌ర్లకు బాగా ఉప‌యోగం ఉంటుంది. 
  • వెబ్‌సైట్ పేరును మాత్రమే అడ్రస్ బార్‌లో ఎంట‌ర్ చేసి " కంట్రోల్ +ఎంట‌ర్ " ప్రెస్ చేస్తే (.com) వెబ్‌సైట్లను, ". షిఫ్ట్ +ఎంట‌ర్ " ప్రెస్  చేస్తే (.net) వెబ్‌సైట్లను చూడ‌వ‌చ్చు.
  • బుక్‌మార్క్ టూల్ బార్‌ను ఉప‌యోగించ‌డం వ‌ల‌న త‌ర‌చూ ఓపెన్ చేసే వెబ్‌సైట్లను త్వర‌గా ఓపెన్ చేసుకోవ‌చ్చు.
  • మౌస్ స్క్రోల్ వీల్ నావిగేష‌న్ స‌హాయంతో వెబ్‌పేజీని వేగంగా పైకీ, క్రింద‌కీ మూవ్ చేసుకోవ‌చ్చు.
  • వెబ్‌పేజీల‌ను సిస్టములో sava as క‌మాండ్ తో Web Page, complete ఫార్మాట్ లో సేవ్ చేసుకుంటే ఇంట‌ర్నెట్ అవ‌స‌రం లేకుండానే గ‌తంలో సేవ్ చేసిన వెబ్‌పేజీని వీక్షించ‌వ‌చ్చు.
  • త‌క్కువ ట్యాబ్ ల‌ను ఓపెన్ చేయ‌డం వ‌ల‌న సిస్టమ్ మ‌రియు ఇంట‌ర్నెట్ ను వేగంగా ఉప‌యోగించుకోవ‌చ్చు.
  • బ్రౌజ‌ర్లకు ల‌భించే యాడ్‌-ఆన్‌లు,ఎక్స్ టెన్షన్‌లతో అనేక ర‌కాల టూల్స్‌ను బ్రౌజ‌రులోనే పొంద‌వ‌చ్చు.
  • కొన్ని సాఫ్ట్‌వేర్లతో వ‌చ్చే టూల్ బార్లను బ్రౌజ‌రులో ఇన్‌స్టాల్ చేసుకుంటే ఆ సాఫ్ట్‌వేర్లు ఇంట‌ర్‌నెట్‌లో అందించే సౌక‌ర్యాల‌ను పొంద‌వ‌చ్చు.